నా కూతురు చంద్రబాబును కలవలేదు

తమకు రాజకీయావకాశాలు కల్పించాలని కోరుతూ తన కుమారుడు, కూతురు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలవలేదని తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. తన కూతురు, అల్లుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు తానే చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాజకీయావకాశం కల్పించి వారిద్దరు చంద్రబాబును కలిసినట్లు మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు. 

తన కూతురికి గానీ, కుమారుడికి గానీ రాజకీయాలంటే తొలి నుంచి ఇష్టం లేదని, అయితే అల్లుడు మాత్రం తొలి నుంచి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని అభిమానించేవాడని ఆమె చెప్పారు. వైయస్సార్ మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏర్పాటు చేయడంతో అల్లుడు, కూతురు అందులో చేరారని ఆమె చెప్పారు