రీ ఎంట్రీ ఇస్తున్న నయనతార
.jpg)
శ్రీరామరాజ్యంతో వెండితెరకు టాటా చెప్పిన నయనతారా ప్రభుదేవాతో పెళ్ళి ఆగిపోవడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి పెడుతోంది. వరుసగా కధలు వింటున్న ఈ అమ్మడు ఇంకా ఏ సినిమా కమిట్ కాలేదు. అయితే ఈ రీ ఎంట్రీలో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హావా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది.
ప్రభుదేవా ఇప్పటికే బాలీవుడ్లో దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా టాప్ రేంజ్లో ఉండటంతో తను తక్కువ కాదని నిరూపించుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. నయన్ పట్టుదల చూస్తుంటే త్వరలో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపడం ఖాయమనిస్తోంది.