ఏప్రిల్‌లో రాష్ట్రానికి కొత్త గవర్నర్?

ఏప్రిల్‌లో రాష్ట్రానికి కొత్త గవర్నర్?

ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్న ఈఎస్ఎల్ఎన్ నరసింహన్ పదవీ కాలం ఇప్పటికే పూర్తయింది. దీంతో ఇటీవలె ఆయన పదవిని కేంద్రం పొడిగించింది. అయితే ఏప్రిల్ మాసంలో పెద్ద ఎత్తున గవర్నర్‌లను కేంద్రం మార్చేందుకు సంసిద్ధమౌతున్నదని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను మార్చి మరొకరిని గవర్నర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్‌లు వచ్చ అవకాశాలున్నాయని అంటున్నారు. మరికొందరికి కూడా స్థానచలనం ఉండవచ్చునని తెలుస్తోంది. కాగా గవర్నర్ నరసింహన్ పదవిని పొడిగించిన సమయంలో తెలంగాణవాదులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. నరసింహన్ తెలంగాణ వ్యతిరేకి అని, ఆయనను పొడిగించవద్దని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.