ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఎంపికైన నటి శారద

Sharada
తెలుగు సినీరంగానికి పితామహులైన ఎన్టీఆర్, బిఎన్ రెడ్డి, రఘుపతి వెంకయ్య, చక్రపాణి నాగిరెడ్డి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా అవార్డులు అందజేస్తున్న విషయం తెలిసిందే. సినీరంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆ అవార్డులను 2010 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2010 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రముఖ నటి శారద దక్కించుకున్నారు. బిఎన్ రెడ్డి అవార్డుకు డైరెక్టర్, నటుడు బి. నర్సింగరావు, రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎం. బాలయ్య, చక్రపాణి-నాగిరెడ్డి అవార్డుకు సర్వ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు.