బాలీవుడ్ తారకు ఫోన్‌లో బెదిరింపులు


ముంబై: గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లో తనను బెదిరింపులకు పాల్పడుతున్నట్టు బాలీవుడ్ తార మమతా పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే విడుదలైన ‘పాన్ సింగ్ తోమార్' చిత్రంలో నటుడు ఇర్ఫాన్ ఖాన్ సరసన హీరోయిన్‌గా మమతా నటించారు. ఇర్ఫాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం కొనసాగిస్తే తీవ్రమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అగంతకులు హెచ్చరించినట్టు ఫిర్యాదులో మమతా తెలిపారు.