ప్రియమణితో సచిన్ వెధవ్వేషాలు

ప్రియమణితో సచిన్ వెధవ్వేషాలు

సిసిఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా హీరోయిన్ ప్రియమణితో సచిన్ జోషి వెధవ వేషాలు వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మధ్య తెలుగులో మౌనమేలనోయి, పండు సినిమాల్లో హీరోగా నటించాడు.

వివరాల్లోకి వెళితే...సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఇటీవల కేరళ స్ట్రైకర్స్-ముంబై హీరోస్ మధ్య కేరళలో టి-20 మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా సచిన్ జోషి ప్రియమణితో మిస్ బిహేవ్ చేశాడు. ఆమెను బలవంతంగా కౌగిలించుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సచిన్ జోషి ప్రవర్తనతో ప్రిమయణి ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి అతడి బారి నుంచి ప్రియమణిని కాపాడట. ఈ విషయాలను హీరోయిన్ ప్రియమణి స్వయంగా వెల్లడించింది. కాగా..ఈ మ్యాచ్ లో కేరళ టీం ముంబై హీరోస్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తెలుగులో చివరి సారిగా గత సంవత్సరం ‘క్షేత్రం' సినిమాలో నటించిన ప్రియమణికి ఈ యేడు ఇప్పటి వరకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. బాబురావు నిన్నొదల అనే ఓ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలోనూ ప్రస్తుతం ప్రియమణి పరిస్థితి అంతే. అయితే కన్నడలో రెండు, మలయాళంలో ఓ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది.