జూ ఎన్టీఆర్ పై కేసు వేస్తా అంటూ వర్మ

జూ ఎన్టీఆర్ పై కేసు వేస్తా అంటూ వర్మ

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా పూజారులపై కామెంట్స్ చేసి వివాదం క్రియేట్ చేసారు. ఆ వివాదాన్ని టీవి ఛానెల్స్ పెద్దది చేయటంతో వర్మ తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ అదుర్స్ చిత్రాన్ని కూడా లాగారు. ఆయన ట్వీట్ లో...

నా పూజారుల మీద కామెంట్ల కంటే జూఎన్టీఆర్ అదుర్స్ లో చేసింది ఎక్కువ కానీ తను స్టార్ కనుక నేను ప్లాప్ డైరక్టర్ కనుక పూజారులు నన్ను టార్గెట్ చేస్తున్నారు.

ఈ విషయం మీద నేను జూ.ఎన్టీఆర్ మీద,పూజారుల మీద,ఎండోమెంట్స్ డిపార్టమెంట్ మీద కంప్లైంట్ ఇస్తా

పూజారుల మీద జూ.ఎన్టీఆర్ కి నాకు మధ్య సెలక్టివ్ డిస్క్రిమినేషన్ నేరం క్రింద కేసు పెడతా

నేను ట్వీట్స్ లో రాసినందుకీ జూ.ఎన్టీఆర్ అదుర్స్ లో చేసినందుకీ కంపేర్ చేస్తే ఏ మూర్కుడుకైనా నేను చెప్పింది అర్దమవుతుంది

అంటూ ట్వీట్ చేసారు. ఇక వర్మ ప్రస్తుతం చేస్తానంటున్న రెడ్డి గారు పోయారు వివాదం మరలించటానికే ఈ కొత్త వివాదాన్ని ఎత్తుకున్నాడని పరిశీలకులు అంటున్నారు. మీడియా సపోర్టుతో ఈ వివాదాన్ని పెద్దది చేసి ఆ వివాదాన్ని మర్చిపోయేలా చేయాలని ఆయన ఆలోచనగా చెప్తున్నారు. అందుకనే ఎన్టీఆర్ ని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని చెప్తున్నారు.