కాంగ్రెస్లో పీఆర్పీ విలీనం పొరపాటే

కాంగ్రెస్లో పీఆర్పీని విలీనం చేసినందుకు చింతిస్తున్నామని మంత్రి సి.రామచంద్రయ్య విచారం వ్యక్తంచేశారు. పార్టీలో నలుగురికి పదవులు దక్కినంత మాత్రాన అంతా హ్యాపీగా ఉన్నట్టు కాదంటూ బాంబు పేల్చారు. ఆ వెంటనే ఆయన నాలిక్కరుచుకున్నారు. మిగతా విషయాలు పొద్దున్నే మాట్లాడతానని అన్నారు.