ఆమెను జూనియర్ త్రిష అంటున్నారు

ఆమెను జూనియర్ త్రిష అంటున్నారు

రీసెంట్ గా మొన్న శుక్రవారం విడుదల అయిన ఈ రోజుల్లో చిత్రం లో హీరోయిన్ రేష్మ గుర్తుండే ఉంటుంది. త్రిష ఫీచర్స్ తో ఉండే ఆమెను ఇప్పుడు అంతా జూనియర్ త్రిష అనిపిలుస్తున్నారు. ఆమెకు చిన్న సంస్ధల నుంచి మెయిన్ హీరోయిన్ గా,పెద్ద సంస్ధల నుంచి సెకండ్ హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. త్రిషను ఎఫర్టు చేయలేని చిన్న హీరోలతో చేసే నిర్మాతలు ఆమెను మంచి ఆఫ్షన్ గా భావిన్నారు. అందులోనూ ఆమె తెలుగులో మాట్లాడటం నిర్మాతలకు, ముఖ్యంగా డైరక్టర్స్ కి బాగా నచ్చుతోంది. 

హిందీ వాళ్ల కన్నా తాము అనుకున్న సీన్స్ ని, డైలాగులును ఆమె అయితే కరెక్టుగా అర్దం చేసుకుని సహకరిస్తుందని ఫిక్స్ అవుతున్నారు. అందులోనూ ఈ రోజుల్లో చాలా చిన్న చిత్రం కావటం, అది పెద్ద హిట్ కావటంతో ఆమెకి బాగా కలిసి వచ్చింది. స్నేహా ఉల్లాల్ ని జూనియర్ ఐశ్వర్యారాయ్ అన్నట్లుగానే ఇప్పుడు ఈమెను జూనియర్ త్రిష అని మీడియా సంభోదిస్తోంది. ఈ హిట్ ఆమె ఎంతవరకూ క్యాష్ చేసుకుని తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తుందనేది ఆమె అనుసరసించే స్ట్రాటజీ మీద ఆధారపడుతుంది.