స్నేహాకు ఎంత కష్టమొచ్చింది!?


నవ్వుల సుందరి స్నేహా త్వరలో పెళ్లికూతురు కానున్న సంగతి తెలిసిందే. కానీ పెళ్లి కూతురు కాబోతున్న స్నేహాకు కష్టమొచ్చిపడింది. పెళ్లి ఖర్చుల కోసం ఈ భామ తన సొంతూరిలోని కళ్యాణ మండపాన్ని కూడా అమ్మేసిందట. దక్షిణాది చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన ఈ హోమ్లీ హీరోయిన్ స్నేహా.. తన తోటి నటుడు ప్రసన్నతో లవ్వాయణం కొనసాగించి.. మే 11న అతడినే వివాహం చేసుకోనుంది. 


తాళి కట్టు శుభవేళ...మెడలో కళ్యాణ మాల అంటూ పాడుకునే సమయంలో స్నేహాకు కష్టమేంటని ఆరా తీస్తే.. పెళ్లి ఖర్చుల కోసం స్నేహా ఏవేవో ప్రయత్నాలు చేస్తుందట. పెళ్లి ఖర్చులకు డబ్బు చాలక సొంత ఊరు కుంభకోణంలో కట్టించిన కళ్యాణ మండపాన్ని కూడా స్నేహా అమ్మేసిందని తెలిసింది. 

అయితే ఇంతవరకు స్నేహ సంపాదించిన డబ్బంతా ఏం చేసిందని కొందరు అనుకుంటున్నారు. మరికొందరైతే స్నేహా సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బంతా కుటుంబీకులు అప్పటికప్పుడే పంచేసుకున్నారని టాక్. ఇంకేముంది.. వివాహ ఖర్చుల కోసం తంటాలు పడుతున్న స్నేహకు ఎంత కష్టమొచ్చిపడిందని సినీ జనం జాలిపడుతున్నారట