అల్లు అర్జున్‌లకు పోటీగా సిద్ధార్థ

అల్లు అర్జున్‌లకు పోటీగా సిద్ధార్థ

మహేష్ బాబు, అల్లు అర్జున్లకు పోటీగా హీరో సిద్ధార్థ కూడా రంగంలోకి దిగుతున్నాడు. వీరి మధ్య పోటీ ఏమిటీ అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మహేష్ బాబు థమ్సప్ కంపెనీకి, అల్లు అర్జన్‌ సెవున్ అప్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. దీంతో పోటీ తట్టుకోవడానికి ఫ్రూటీ కంపెనీ సిద్ధార్థను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంది. వేసవి నేపథ్యంలో కూల్ డ్రింకుల అమ్మకాలు జోరందుకోనున్న నేపథ్యంలో...కంపెనీలు కూడీ పోటీ పడుతూ సినీ స్టార్లతో ప్రచారం చేయిస్తున్నాయి. సిద్ధార్థ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబట్టి అతనితో రూపొందించిన ఫ్రూటీ యాడ్ దేశంలోని అన్ని భాషల్లో రూపొందిస్తున్నారు. గతంలో సిద్ధార్థ ‘పీటర్ ఇంగ్లాండ్' బ్రాండ్ దుస్తులకు అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

సిద్ధార్థ నటించిన ‘లవ్ ఫెయిల్యూర్' చిత్రం ఇటీవల విడుదలై ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అతడు తెలుగులో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లకొండ సురేష్ తెరకెక్కిస్తున్నారు.