'గోల గోల'చేస్తున్న హీరో శివాజి...

'గోల గోల'చేస్తున్న హీరో శివాజి...

కామెడీ చిత్రాల హీరో శివాజీ తాజా చిత్రానికి'గోల గోల'అనే టైటిల్ ఫిక్స్ చేసారు. గాయత్రి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని వై.రాణి, విక్రమ్‌రాజు నిర్మిస్తూంటే... శ్యామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి శివాజీ మాట్లాడుతూ...ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. తెరపై కనిపించే ప్రతి పాత్ర కూడా తనదైన శైలిలో గోల చేసి ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. భావితరం హాస్యనటులంతా ఇందులో కనిపిస్తారు. నిర్మాత లాభపడేలా పక్కా ప్రణాళికతో చేస్తున్న చిత్రమిది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఇదివరకు శివాజీతో 'సీతారాముడు' సినిమా తీశాను. మరోసారి ఆయనతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది'' అన్నారు. ''ఒక మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నామన్న తృప్తి ఉంది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని''అన్నారు విక్రమ్‌రాజు. జ్యోతి, ఆర్‌.కె., సత్యం రాజేష్‌, తాగుబోతు రమేష్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రధారులు. కథ, మాటలు: రాజా చంద్రవర్మ, సంగీతం: రవివర్మ, ఛాయాగ్రహణం: బి.వాసు.