శాటిలైట్ రైట్స్ జూ ఎన్టీఆర్ కి

                                               The Business Man
మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం బిజినెస్ మ్యాన్ శాటిలైట్ రైట్స్ ని జూ ఎన్టీఆర్ కి చెందిన స్టూడియో ఎన్ ఛానెల్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆరున్నర కోట్ల రూపాయలుతో ఈ రైట్స్ ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నుంచి తీసుకున్నట్లు చెప్తున్నారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈ చిత్రం హిందీ రీమేక్ ను అభిషేక్ బచ్చన్ చేయటానికి అంగీకరించిన సంగితి తెలిసింది. హిందీ వెర్షన్ లో చేయటానికి గానూ అభిషేక్ బచ్చన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసి తెలిపారు. ఆ ట్వీట్ లో...ఫైనల్ గా ప్రాజెక్టు ఖరారైంది. నేను, పూరీ జగన్నాధ్ కలిసి ఇద్దరం కలిసి తెలుగులో సూపర్ హిట్ అయిన బిజినెస్ మ్యాన్ రీమేక్ చేయనున్నాం. అందులో అభిషేక్ బచ్చన్ చేస్తున్నారు అని ట్వీట్ చేసారు. ఇలా బిజినెస్ మ్యాన్ ఇప్పటికీ నిర్మాతలకు ఏదో రకంగా బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదించి పెడుతూనే ఉంది.