యాంకర్ ఉదయభాను మరీ శృతి మించింది

యాంకర్ ఉదయభాను మరీ శృతి మించింది

శృతి మించి రాగాన పడుతున్నది అన్నట్లుగా ఉదయభాను పరిస్దితి తయారైందని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. యాంకర్ ఉదయభాను రీసెంట్ గా యాంకరింగ్ చేసిన '3'సినిమా ఆడియో పంక్షన్ అందరికీ గంగ వెర్రిలెత్తించింది. ధనుష్ నటించిన '3' సినిమా తమిళ చిత్రం తెలుగు వర్షన్‌ ఆడియోను హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి తాజ్‌ డక్కన్‌లో నిర్వ హించారు. ఆ చిత్ర నిర్మాత నట్టికుమార్‌.. ఉదయభాను మీద అభిమానంతో ఆమె యాంకరింగ్ కి ఆహ్వానించాడు. ఈ ఆడియోవేడుకలో యాంకర్‌ ఉదయభాను శృతిమించిన యాంకరింగ్‌కు వచ్చిన వారంతా బెంబేలెత్తిపోయారు. 

ధనుష్‌ మాట్లాడాలని అందరూ ఎదురుచూస్తుంటే ఆమె మాటలే ఎంతసేపటికీ ముగియకపోవటం.. అదీ బాగా అర్దం పర్దం లేకుండా పోవటంతో అతిధులు విసుగ్గా ముఖాలు పెట్టుకున్నారు. ఇక '3'చిత్రం ఈ నెలాఖరుకు విడుదల చేస్తున్నారు. కొలావరి డీ పాట పెద్ద హిట్టవటంతో సినిమా పై బాగా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇది ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా చెప్తున్నారు. శృతి హాసన్ కూడా ఈ చిత్రంలో అదరకొట్టిందని యూనట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ బావున్నాయి.