ఆస్తుల వివరాలను వెల్లడించిన యూపీ సీఎం

ఆస్తుల వివరాలను వెల్లడించిన యూపీ సీఎం

యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 38ఏళ్ల అఖిలేష్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతూనే తన పేరుతో వున్న ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయనకున్న ఆస్తుల జాబితాను యూపీ ప్రభుత్వ వెబ్ సైట్‌లో పొందుపరిచారు. 1.18 కోట్ల రూపాయల నగదు, 98 లక్షల విలువ చేసే వ్యవసాయ భూమి, కోటి రూపాయల పెట్టుబడులు తన పేరిట ఉన్నట్లు ప్రకటించారు. మూడు నివాస గృహాలతో పాటు తన పేరుతో 1.3 కోట్ల రుణం ఉన్నట్లు వెబ్‌సైట్‌లో ఉంచారు. పారదర్శకంగా ఉండేందుకే అఖిలేష్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారని సమాజ్ వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.