కాస్ట్లీ గిఫ్ట్‌ ఇచ్చిన పెళ్లాం!

 కాస్ట్లీ  గిఫ్ట్‌ ఇచ్చిన పెళ్లాం!

భర్త భార్యను చావగొట్టి అన్ని టెలివిజన్లలో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్‌గా నిలిచిన కన్నడ సినీ హీరో 'దర్శన్' మీకు గుర్తుండే ఉంటాడు. గడచిన సెప్టెంబర్ నెలలో తన భార్య 'విజయలక్ష్మి దర్శన్'ని రక్తం వచ్చేలా గాయపరచి దర్శన్ మీడియాలోకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే భార్య దర్శన్‌కు అధిరిపోయే కానుకను తన 36వ పుట్టిన రోజు సందర్భంగా బహుకరించింది.

దర్శన్ నేడు (ఫిబ్రవరి 16) తన 36వ పుట్టిన రోజును బెంగుళూరులోని తన నివాసంలో జరుపుకున్నాడు. దర్శన్‌కు పుట్టిన రోజు కానుకగా ఆయన భార్య విజయలక్ష్మి రూ.1.38 కోట్లు ఖరీదు చేసే బ్లూ కలర్ జాగ్వార్ ఎక్స్‌జేఆర్ కారును బహుకరించింది. భర్త తనను ఎంత వేధించినా విజయలక్ష్మి మాత్రం అతగాడిని క్షమించి ఆదర్శ మహిళ అనిపించుకుంది.

అందుకే అంటారు కొట్టినా తిట్టినా పెళ్లాం పెళ్లామే అని. దర్శన్‌కు కన్నడ సినీ రంగంలో మంచి పేరుంది. మంచి నటుడిగా కూడా గుర్తింపు పొందాడు. ఇతడు 44 సినిమాల్లో నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా దర్శన్‌కు మంచి గుర్తింపు ఉంది. దర్శన్ వద్ద ఇప్పటికే ఖరీదైన హమ్మర్ హెచ్3, ఆడి ఏ6, టొయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లు కూడా ఉన్నాయి.