ఎన్టీఆర్ బాద్షా కి రామ్ చరణ్ రావటం వెనక

ఎన్టీఆర్ బాద్షా కి రామ్ చరణ్ రావటం వెనక

ఎన్టీఆర్ తాజా చిత్రం బాద్షా నిన్న ఆదివారం నాడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ రావటం అంతటా చర్చనీయాంశమైంది. హీరోల మధ్య ఉన్న స్నేహ పూరిత వాతావరణం ప్రతిబింబిస్తోందంటూ మీడియా ఈ సంఘటనను అభివర్ణించింది. అయితే హటాత్తుగా రామ్ చరణ్ ఇలా మరో స్టార్ హీరో సినిమా ఓపెనింగ్ రావటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ని ఎన్టీఆర్ కలిసి తన సినిమా పంక్షన్ కి రమ్మని ఆహ్వానించాడని, అయితే పవన్ కొత్త కాంట్రావర్శీలు లేపటం ఇష్టం లేక రామ్ చరణ్ ని పంపాడంటున్నారు. 

తాను రచ్చ ఆడియోకు రాకపోవటంతో మీడియా వర్గాల్లో జరిగిన ప్రచారం, ఇప్పుడు ఇలా తన ఇంటి హీరో కాకుండా మరో హీరో సినిమా పంక్షన్ కి వెళితే కావాలని పెంచినట్లు అవుతుందని ఆయన ఫీలై, రామ్ చరణ్ ని పంపాడంటున్నారు. మరో ప్రక్క తెరవెనక రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులని అందుకే వెంటనే చరణ్ ఓకే చేసాడని చెప్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పంక్షన్ అయిపోయాక ఒకే కారులో కలిసి వెళ్లిపోవటం జరిగింది.