కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య !

అక్రమ సంబంధానికి అడ్డోస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. వరంగల్‌ జిల్లా కేసముద్రం కల్వల గ్రామానికి చెందిన మహ్మద్‌ యాఖూబ్‌పాషా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతని భార్య షాహినాబేగం మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో తీవ్రంగా మందలించాడు. 

దీంతో ఆగ్రహించిన షాహినా అన్నంలో విషం కలిపి భర్తను చంపింది. అనంతరం గుండెపోటు వచ్చి చనిపోయాడంటూ గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆగ్రహించిన స్థానికులు నిందితురాలి దేహశుద్ధి చేయడంతో నేరం అంగీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.