జగన్‌ పంచ్‌ డైలాగ్‌లు

 జగన్‌ పంచ్‌ డైలాగ్‌లు

కాంగ్రెస్, టీడీపీలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు రానున్న ఉప ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోనున్నాయని ఆరోపించారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా కోవూరులో వచ్చిన ఫలితమే మళ్లీ రిపీటవుతుందన్నారు. గుంటూరు జిల్లాలో యువనేత చేస్తున్న ఓదార్పుయాత్ర జోరుగా సాగుతోంది. 

త్వరలో రానున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సమర సన్నాహం మొదలెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన...సెంటర్ సెంటర్ కు టీడీపీ, కాంగ్రెస్ లపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ పార్టీల వల్ల ప్రయోజనం లేదని ....తమ వల్లే స్వర్ణయుగం సాధ్యమని జనానికి చెబుతున్నారు.

ఉప ఎన్నికల్లో పోటీ పడే సత్తా లేక...కాంగ్రెస్,టీడీపలు కుమ్మక్కవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు జగన్. వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన చివరికి విశ్వాసమే గెలుస్తుందన్నారు. కోవూరులో ఏం జరిగిందో ...త్వరలో రాబోయే బై పోల్స్‌లోనూ అదే పునరావృత్తం అవుతుందన్నారు.