ఇక "ఈగ"లతో జాగ్రత్తగా ఉండాలి

ఇక "ఈగ"లతో జాగ్రత్తగా ఉండాలి

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న "ఈగ" చిత్రంను రామ్ చరణ్ తేజ ప్రశంశలలో ముంచెత్తారు.  రచ్చ చిత్రీకరణలో బిజీగా ఉండటం మూలాన ఈగ ఆడియో విడుదలకు రాలేకపోయిన రామ్ చరణ్ ఈరోజు "ఈగ" ట్రైలర్ చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు " ఇప్పుడే రాజమౌళి ఈగ ట్రైలర్ చూసాను అద్భుతంగా ఉంది. రాజమౌళి మరియు అతని బృందంకి నా అభినందనలు. ఇంక మనం మన చుట్టూ ఉన్న ఈగలతో జాగ్రత్తగా ఉండాలి" అని ట్విట్టర్ లో అన్నారు. రామ్ చరణ్ మరియు రాజమౌళి కలయికలో వచ్చిన చిత్రం "మగధీర" భారీ విజయం సాదించిన విషయం విదితమే. ప్రస్తుతం రామ్ చరణ్ తన రాబోయే చిత్రం "రచ్చ" విడదల కోసం వేచి చూస్తున్నారు.