కామ్రెడ్లు రాజకీయం

కామ్రెడ్లు రాజకీయం

కామ్రెడ్లు రాజకీయంగా ఎవరి దారి వారే చూసుకుంటున్నారు. సిద్ధాంతాలు ఒక్కటే అయినా... ఉభయ కమ్యునిస్టులు భావజాలంలో సైడయి పోయాయి. బద్ధశత్రువులైన TRS - TDPలతో స్నేహం ఆశిస్తున్న CPI త్వరలో జరగబోయె బైపోల్స్‌లో ఎక్కడ పోటీచేయాలి. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో డిసైడ్‌ చేయనుంది. అటు CPM మాత్రం ఒంటరిగానే పోటీచేస్తామని ఎవరితో పొత్తులుండవని తేల్చేసింది.

తెలంగాణ వాదాన్ని భుజానికెత్తుకున్న సిపిఐ వరంగల్‌ జిల్లా పరకాలలో పోటీ చేసేందుకు సిద్ధపడుతోంది. ఇందుకోసం TRS మద్దతు కోరుకుంటోంది. పరకాల సీటును తమకు వదిలేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ TRS చీఫ్‌ KCRను కోరారు. ఈ విషయంపై ఫోన్‌లో మంత్రాంగం సాగించిన నారాయణ బిజేపి-కాంగ్రెస్‌లకు చెక్ పెట్టాలంటే తమతో కలసి రావాలని కోరినట్లు సమాచారం. 

అటు అనంతపురం స్థానంపై మద్దతిచ్చేందుఉ టిడిపి అధినేత చంద్రబాబు ముందుకు రావడంతో కదనోత్సాహం మీదున్నారు నారాయణ. అయితే ఏ పార్టీతో పొత్తులేకుండా ఇండిపెండెంట్‌గా పోటీచేయబోయే CPMకు మద్దతిస్తామని CPI ప్రకటించింది. అనంతపురంలో టిడిపి మద్దత్తు ఇస్తానని ముందుకు రావడంతో ప్రతిగా సిపిఎం పోటీచేయని స్దానాల్లో పచ్చదండుకు మద్దతు ఇవ్వాలన్నది నారాయణ ఆలోచన.

అయితే ఇక్కడ పోటీ విషయంలో CPM ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. అనంతపురం, పరకాల పోటీ విషయంపై ఉన్న సందిగ్ద పరిస్థితులపై ఉభయ వామపక్ష పార్టీలు మరోసారి భేటీ కానున్నాయి. ఉపఎన్నికల్లో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. 

ఐదు స్థానాల్లో తమ అభ్యర్థుల్ని బరిలోకి దించుతున్నామన్నారు.అయితే అనంతపురం స్థానంలో సిపిఎం వెనక్కితగ్గే చూచనలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో మిగిలిన స్థానాల్లో TDPకి మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.