కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు : జగన్‌

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు : జగన్‌

ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌తో పోరాటం చేస్తున్న తాను.. భవిష్యత్‌లో ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని జగన్‌ అన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే.. మంత్రి అయ్యేవాడినని.. ఆ పార్టీని వీడడం వల్లే తనను వివాదాల్లోకి లాగారని జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన తండ్రి వైఎస్సార్‌ అధికారాన్ని అడ్డు పెట్టుకుని లాభాలు గడించినట్టు వస్తున్న ఆరోపణల్లో పస లేదన్నారు. తనకు తానుగా ముందుకెళ్లానని, లాభాలు వస్తాయన్న అంచనాతోనే తన సంస్థల్లో ఇతరులు పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు.

1. దేశంలో టాప్-10లో నిలిచే రెండు ఫార్మా కంపెనీలకు వెనుకబడిన
మహబూబ్‌ నగర్, మెదక్‌ జిల్లాల్లో ఎకరం రు. 7 లక్షలకే ఎస్‌ఇజడ్‌లో 
భూములిచ్చారన్నది అభియోగం. తమిళనాడు, గుజరాత్‌లో అయితే..
ఉచితంగా భూములిస్తామంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు?

2. హైద్రాబాద్ నడిబొడ్డున ఎమ్మార్‌కు 535 ఎకరాలు కట్టబెట్టారు. గోల్ఫ్‌కోర్స్‌, హోటల్, విల్లాల కోసం ఎకరం రు.29 లక్షలకే ఇచ్చేశారు. ఇప్పుడక్కడ రు.4 కోట్లు ధర ఉంది. అదంతా సక్రమమే అంటున్నారు. ఆ కేసు విచారిస్తున్న సీబీఐ...
చంద్రబాబును ప్రశ్నించలేదేం?

3. సాక్షి పత్రికది దేశంలోనే 8వ స్థానం. లాభాల కోసమే పెట్టుబడి పెట్టారు.
రు.1800 కోట్లు నష్టాలు వస్తున్నపోటీ పత్రికతో పోలిస్తే.. సాక్షికి సగం విలువ కట్టాం. పబ్లిక్‌ ఇష్యూకి వెళ్తే.. పెట్టుబడి రెండింతలు అవుతుంది. పోటీ పత్రికది చట్టబద్ధం.. సాక్షిలో పెట్టుబడులు ఇల్లీగల్‌ అవుతాయా? నా ఆస్తులపై సీబీఐ చేసిన 
దాడుల్లో ఏం తేల్చింది?

4. వైఎస్సార్‌ కుమారుడిగా నేను అసలు హైదరాబాద్‌లోనే లేను. బెంగళూర్‌ నుంచి 20 రోజులకు ఒకసారి వచ్చేవాడిని. నా పిల్లలు బెంగళూర్‌లోనే చదువుతున్నారు.
ఐఏఎస్‌లకు, మంత్రులకు గానీ నేనెప్పుడూ ఫోన్ చేయలేదు. సచివాలయానికీ వెళ్లలేదు. నాకు నేనుగా ముందుకెళ్లాను.

5. కాంగ్రెస్‌ను వీడాను కాబట్టే..విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీలో ఉండి ఉంటే.. మంత్రి అయ్యేవాడిని. అప్పుడీ వివాదాలు వచ్చేవా? 

6. నేను, కాంగ్రెస్‌ కలిసి సాగలేం. నేను కాంగ్రెస్‌లో చేరను. రాష్ట్రంలో విపక్షంలో ఉన్నాం. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నాం. వ్యక్తిత్వానికి, విశ్వసనీయతకు విలువిస్తాను. నేను కాంగ్రెస్‌లో చేరడం గానీ, పార్టీని విలీనం చేయడంగానీ 
ఎప్పటికీ జరగదు.