6 రోజులకు తమన్నారేటు రూ. 60 లక్షలు!

6 రోజులకు తమన్నారేటు రూ. 60 లక్షలు!

మిల్కీ బ్యూటీ తమన్నా రేటు ఎంతో తెలుసా..? ఆరు రోజులకు అక్షరాల 60 లక్షలు. అయితే ఇది సినిమాల విషయంలో కాదు. యాడ్ ఫిల్మ్స్ విషయంలో. ఈమధ్య సౌత్ లో ఆమె ఇమేజ్ బాగా పెరగడంతో పలు సంస్థలు ఆమెతో తమ బ్రాండ్లు ప్రచారం చేయించుకోవడానికి పోటీ పడుతున్నాయి.

వేసవి కావడంతో పలు కూల్ డ్రింగ్ కంపెనీలు పలు కొత్త యాడ్‌లను చిత్రీకరిస్తున్నారు. కొన్ని కంపెనీలయితే కొత్త బ్రాండ్ అంబాసిడర్లను కూడా నియమించుకుంటున్నారు. ఇన్నాళ్లు ఫాంటా శీతల పానీయానికి జెనీలియా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. అయితే ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుని దక్షిణాది సినిమాల దూరం కావడంతో ఇప్పుడు ఆ అవకాశం తమన్నాకు దక్కింది. 

ఫాంటా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏడాదికి ఆరు రోజుల కాల్ షీట్స్ ఆమె ఈ సంస్థకి కేటాయించాల్సి వుంటుంది. ఈ సమయంలో వాళ్లు తమ యాడ్ల చిత్రీకరణ, ఫోటో షూట్లు తదితర పనులన్నీ పూర్తి చేసుకుంటారు. తన కాల్షీట్లు ఇచ్చినందుకు గాను, తన ఫోటోలు వాడుకున్నందుకు గాను ఏడాదికి రూ. 60 లక్షలు చెల్లిస్తుంది ఆ కంపెనీ.

అయితే డబ్బు వస్తుంది కాదా అని ఏ యాడ్ పడితే ఆ యాడ్ ఒప్పుకోనని, తన ఇమేజ్‌కు సూటయ్యేవి మాత్రమే చేస్తానని చెబుతోంది. ప్రస్తుతం రచ్చ సక్సెస్ ను బాగా ఎంజయ్ చేస్తున్నానంటోంది. రచ్చ తర్వాత తమన్నా ప్రభాస్ సరసన రెబల్ చిత్రంలో, రామ్ సరసన ఎందుకంటే ప్రేమంట చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ సరసన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికయింది