నన్నలా పిలవొద్దు: రామ్ చరణ్

నన్నలా పిలవొద్దు: రామ్ చరణ్

నన్ను ‘రామ్ చరణ్ తేజ్' అని పిలవొద్దు...జస్ట్ ‘రామ్ చరణ్' అని పిలవండి అంటూ గతంలో ఓసారి మెగాపవర్ స్టార్ విన్నవించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ అంతా ఇంకా రాంచరణ్ తేజ్ అనే పిలుస్తున్నారు. మీడియాలో కూడా అదే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మరోసారి తన ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నాడు. 

‘మా నాన్న నాకు ‘రామ్ చరణ్' అని మాత్రమే పేరు పెట్టారు...దయచేసి నా పేరు చివర తేజ అనే పదం యాడ్ చేసి పిలవొద్దు, రామ్ చరణ్ అని పిలిస్తేనే నాకు నచ్చుతుంది....ఇదే విషయాన్ని మీడియా వారికి కూడా విన్నవిస్తున్నా' అంటూ చెర్రీ తన ట్విట్టర్లో కొద్ది సేపటి క్రితం పేర్కొన్నాడు.

ప్రస్తుతం చరణ్ ‘జంజీర్' షూటింగులో భాగంగా ముంబైలో ఉన్నాడు. ఈచిత్రం ద్వారా చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. చెర్రీ తొలి బాలీవుడ్ ఎంట్రీ కావడంతో ఇటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘ జింజర్  1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.