కాలిఫోర్నియా స్కూల్లో కాల్పులు

కాలిఫోర్నియా స్కూల్లో కాల్పులు

అమెరికాలోని ఓ కాలేజీలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్ధులు చనిపోయారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ మత సంబంధమైన కళాశాలలో కొరియన్‌ సంతతికి చెందిన ఓన్‌ గో అనే వ్యక్తి కొన్ని నెలలుగా క్లాసులకు గైర్హాజరయ్యాడు. నిన్న అకస్మాత్తుగా కాలేజీ వచ్చిన అతను గన్‌తో విద్యార్ధులను బెదిరించాడు. 

గోడకు ఆనుకొని లైన్‌లో నుంచోమని ఆదేశించాడు. ఆ తర్వాత విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడ్డ మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వీరిలో భారత సంతతికి చెందిన దావిందర్‌ కౌర్‌ అనే విద్యార్థిని కూడా ఉంది.