శ్రీనివాసరెడ్డిపై సర్కార్ సీరియస్‌

శ్రీనివాసరెడ్డిపై సర్కార్ సీరియస్‌

డీజీగా పదోన్నతితో తీర ప్రాంత భద్రతా దళానికి బదిలీ అయిన ఏసీబీ సిట్‌ చీఫ్‌ శ్రీనివాసరెడ్డిపై సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. బదిలీ చేసి మూడు రోజులవుతున్నా ఇంకా రిలీవ్‌ కాకపోవడంతో ఛార్జ్‌మెమో జారీ చేసింది. సాధారణ పరిపాలన విభాగం పోలీసుల సహాయంతో మెమో అందించింది. 

ఇదిలా ఉంటే శ్రీనివాసరెడ్డి బదిలీని ఏసీబీ డీజీ భూపతిబాబు వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను ప్రస్తుత స్థానంలోనే కొనసాగనివ్వాలని ప్రభుత్వానికి లేఖసైతం రాశారు.