తార చౌదరి చేతి లో బడా బాబుల జాతకం

తార చౌదరి చేతి లో బడా బాబుల జాతకం

హైటెక్ వ్యభిచారం సూత్రధారిగా అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి సెల్ డైరీని పరిశీలిస్తే దిమ్మ తిరిగే విషయాలు బయటపడుతున్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. మూడు నెలల కాలంలో తారా చౌదరి 8 వేల కాల్స్ చేసినట్లు చెబుతున్నారు. గత మూడు నెలల కాలంలో తారా చౌదరి సాగించిన సంభాషణల వివరాలను పోలీసులు పరిశీలించినట్లు చెబుతున్నారు.

తారా చౌదరితో గంటల తరబడి మాట్లాడినవారిలో ప్రముఖులే ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పోలీసాఫీసర్లు అందులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎక్కువగా సంపన్నులతోనే ఆమె సంబంధాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. తారా చౌదరితో మాట్లాడినవారిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన కొంత మంది రాజకీయ నాయకులతో తారా చౌదరి అలియాస్ రాజేశ్వరి గంటల తరబడి మాట్లాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక సెల్‌ఫోన్‌లో సందేశాలకు అంతే లేదని అంటున్నారు. అమ్మాయిలతో కస్టమర్ల శృంగార సంఘటనలను తారా చౌదరి రికార్డు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమెను విచారిస్తే అవి బయటకు రావచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

తారా చౌదరి చెర నుంచి తప్పించుకుని మీడియాకు ఎక్కిన శ్రీలక్ష్మి అనే విశాఖపట్నానికి చెందిన అమ్మాయి తన ప్రాణాలకు ముప్పు ఉందని భయపడుతోంది. విశాఖపట్నంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న శ్రీలక్ష్మిని ఉద్యోగం పేరుతో బుట్టలో పడేసిన తారా చౌదరి హైదరాబాదుకు తీసుకుని వచ్చి రొంపిలోకి దింపినట్లు ఆరోపణలు వచ్చాయి. ముంబైకి చెందిన గూండాలతో శ్రీలక్ష్మి ప్రాణాలకు తారా చౌదరి ముప్పు తలపెట్టవచ్చునని ఆమె బంధువులు అంటున్నారు. ఫిబ్రవరి 29వ తేదీన హైదరాబాదు వచ్చిన తారా చౌదరి చెరలో ఉన్న శ్రీలక్ష్మి శనివారం తప్పించుకుని వచ్చి ఓ తెలుగు టీవీ చానెల్‌లో ప్రత్యక్షమైంది.