ప్రత్యేక రాయబారిగా ఏంజలీనా జోలీ

 ప్రత్యేక రాయబారిగా ఏంజలీనా జోలీ

ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషన్(యుఎన్‌హెచ్‌సిఆర్) ప్రత్యేక రాయబారిగా నియమితులయ్యారు. ఈ కమిషన్‌కు సౌహార్ధ రాయబారిగా ఉన్న ఆమెను ప్రత్యేక రాయబారిగా నియమించినట్లు యుఎన్‌హెచ్‌సిఆర్ అధికార ప్రతినిధి ఆడ్రియన్ ఎడ్వర్డ్ తెలిపారు.

ఇలా తాము ప్రత్యేక రాయబారిని నియమించడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. ఆమె ఈ కొత్త హోదాలో హై కమిషనర్ ఆంటోనియో గటెర్రస్ తరఫున ప్రపంచవ్యాప్తంగా నిర్వాసితులకు సంబంధించిన అంశాల్లో మధ్యవర్తులు, దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతారని యుఎన్‌హెచ్‌సిఆర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల ప్రమోషన్ ప్రారంభించిన దశాబ్దం తర్వాత ఏంజెలీనా జోలికి ఈ ప్రమోషన్ వచ్చింది. ఏంజెలీనీ జోలీని ఇలా ప్రత్యేక రాయబారిగా ప్రకటించడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఎక్కైనా ఈ పదవిని రిటైర్జ్ రాజకీయ నాయకులు, కేరీర్ డిప్లమాట్స్‌కు కేటాయిస్తారు. ఆమె తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆడ్రియన్ ఎడ్వర్డ్ అన్నారు.

ఏంజెలీనా గత పదేళ్లుగా సేవలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈమె ఇరాక్, హైతి, పాకిస్తాన్ తదితర ప్రాంతాలను ఆమె సందర్శించారు. సేవకోసం ఆమె భారీగా సేవా సంస్థలకు డబ్బులను విరాళంగా ఇచ్చారు.