వేశ్య పాత్రల్లో నాయికలు

వేశ్య పాత్రల్లో నాయికలు

కథానాయికలు వేశ్యపాత్రలు ధరించడానికి ఒకపడు జంకేవారు. తమపై 'సెక్సీ ముద్ర' పడుతుందనే భయం ఉండేది వాళ్లల్లో. నాటి ప్రసిద్ధ హీరోయిన్‌ బి.సరోజాదేవి మొదట వేశ్య పాత్రలోనే 'పాండురంగ మహాత్మ్యం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. భానుమతి, లకి్ఝ, జయసుధ వంటి ప్రముఖ నటీమణులు ఆ తరహా పాత్రలు ధరించినా, వాళ్ల 'హీరోయిన్‌ ఇమేజ్‌'కి ఆ పాత్రలు ప్రతిబంధకం కాకపోగా, అవి వాళ్ల నటనా ప్రతిభకు దర్పణాలుగా నిలిచాయి. నేటి తరం తారల్లో అనుష్క, శ్రద్ధాదాస్‌ వేశ్య పాత్రలు పోషించారు. విభిన్న తరహా పాత్రల పట్ల విశేషమైన ఉత్సాహం చూపే ఛార్మి కూడా తెలుగులో ఒక చిత్రంలో సెక్స వర్కర్‌గా నటిస్తోంది. ఓ అంధుడైన గాయకుడు, కాల్‌ గరల్‌ మధ్య నడిచే ప్రేమకథలో ఛార్మి కాల్‌ గరల్‌గా నటిస్తోంది. ''ఇందులో సగటు ప్రేక్షకుడు ఊహించే మసాలా సన్నివేశాలేవీ ఉండవు. నాయిక కాల్‌ గరల్‌ అయినా ఆ గాయకుణ్ణి ప్రేమిస్తూ, అతని ఉజ్జ్వల భవిష్యత్తుకు ఏవిధంగా దోహదం చేస్తుందనేది ఉదాత్తంగా చిత్రీకరిస్తారు'' అని చెబుతోంది ఛార్మి. ఇదిలా ఉండగా, తాజాగా, ప్రముఖ నాయిక శ్రియా (శరణ్‌) కూడా ఓ తెలుగు చిత్రంలో నాయికగా అంటే వేశ్య పాత్రలో నటించడానికి అంగీకరించింది. ''స్క్రిప్టు నాకు బాగా నచ్చింది. అందుకే అంగీకరించాను'' అంది శ్రియ. ఈ ధోరణి చూస్తుంటే, నాయికలు కొత్తదనం కోసం ఎలా తాపత్రయపడుతున్నారనీ అర్థమవుతోంది!