కదులుతున్న నటి తారా చౌదరికి డొంక!

కదులుతున్న నటి తారా చౌదరికి డొంక!

ఓ గుట్కా వ్యాపారితో కూడా నటి తారా చౌదరికి సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ అమ్మాయిని వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నించిన క్రమంలో తారా చౌదరి అరెస్టయిన విషయం తెలిసిందే. తారా చౌదరి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆడియో టేప్‌లు సంచలన విషయాలను బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. తారా చౌదరి మొబైల్ సంభాషణలను, పోలీసులూ వ్యాపారులతో జరిపిన అర్థరాత్రి సంభాషణలను తారా చౌదరి రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

మంత్రులు, పార్లమెంటు సభ్యులతో పాటు పలువురు ప్రముఖులతో తారా చౌదరికి పరిచయాలున్నట్లు తెలుస్తోంది. తారా చౌదరి డైరీలో ఓ ప్రముఖ గుట్కా వ్యాపారి పేరు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. మర్డర్ కోసమంటూ ఆ డైరీలో రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారని ఆ పత్రిక రాసింది. ఆ గుట్కా వ్యాపారి పేరు, ఫోన్ నెంబర్ కూడా డైరీలో ఉందని చెబుతున్నారు. 

ఆ గుట్కా వ్యాపారికి మాజీ ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నట్లు ఆంగ్ల పత్రిక రాసింది. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ఆయనకు ఓ గెస్ట్ హౌస్ కూడా ఉందని చెబుతున్నారు. ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్‌తో, ఆ వ్యాపారితో జరిపిన సంభాషణలు కూడా ఆడియోలో రికార్డు అయినట్లు చెబుతున్నారు. 

ప్రకాశం జిల్లా పామూరు మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన తారా చౌదరి హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ఉంటూ అక్రమ కార్యకలాపాలు సాగిస్తూ వస్తోంది. ఆమె భర్త ఆర్ దుర్గా ప్రసాద్ బంజారాహిల్స్‌లోని నవోదయ కాలనీలో ఉంటున్నాడు. ఇతను విజయవాడకు చెందినవాడు. వీరిద్దరిని పోలీసులు మార్చి 31వ తేదీన అరెస్టు చేశారు. తారా చౌదరి నుంచి పలు విషయాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు.