రవి రిషిపై సీబీఐ నిర్బంధ ఆదేశాలు

రవి రిషిపై సీబీఐ నిర్బంధ ఆదేశాలు

 రక్షణ రంగంలో వెలుగుచూసిన ‘టట్రా' కుంభకోణంలో నిందితుడిగా పేర్కొంటున్న ఎన్నారై వ్యాపారవేత్త రవి రిషి దేశం విడిచి వెళ్లకుండా సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిర్బంధ ఆదేశాలిచ్చింది. 

మరోవైపు నాసిరకం టట్రా ట్రక్కుల కొనుగోలు కోసం రూ. 14 కోట్ల లం చం ఇవ్వజూపింది రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ తేజిందర్‌సింగేనంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ శనివారం లాంఛనంగా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలోనే మరిన్ని ఆధారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో తేజిందర్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.