ఇండోనేషియాలో మళ్లీ భూకంపం

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం

ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలోని పపువా ప్రావిన్స్‌కు 83 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం నమోదైంది. సముద్ర ప్రాంతంలో 18 మైళ్ల లోతున ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.6 గా నమోదైందని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. 

భూకంప కేంద్రం మనోక్వాన్‌ పట్టణానికి సమీపంలో ఉండడంతో ఆ ప్రాంతంలో భారీ భవనాలు కొన్ని క్షణాల పాటు కంపించాయి. దాంతో భయభ్రాంతులైన ప్రజలు ఇళ్లలోంచి పరుగులు తీశారు. కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. తీవ్రత తక్కువ కావడంతో ఇండోనేషియా ప్రభుత్వం ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.