త్రిషను దెబ్బకొడుతున్న జూనియర్ త్రిష

త్రిషను దెబ్బకొడుతున్న జూనియర్ త్రిష

త్రిష, ఎన్టీఆర్ నటించిన దమ్ము కొద్ది రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సమయంలో.. ఊహించని విధంగా త్రిషకు కొత్త సమస్య ఎదురైంది. జూనియర్ త్రిషగా మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న రేష్మ ఆమెకు పోటీ ఇస్తోంది. ఈరోజుల్లో చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వైపే ఇప్పుడు నిర్మాతలంతా దృష్టి పెడుతున్నారు. త్రిష దొరకని వాళ్లు సైతం ఆమెతో ఎడ్జెస్ట్ అవ్వాలనుకుంటే...కొత్త వాళ్లు ఎలాగే త్రిష పోలికలతో ఉన్న ఆమెను లక్కీ గర్ల్ గా గుర్తించి తమ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ చేస్తున్నారు. 

దాంతో ఇప్పటివరకూ అంటే ఒక దశాబ్దకాలానికి పైగా తిరుగులేని ఆధిపత్యం చలాయించిన త్రిషకు సినిమా రంగంలో అసలైన కష్టాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొందరు హీరోలు ఆమెను దూరం పెడుతున్నారు. అన్నింటికన్నా ప్రధానంగా ఆమె వయసు సమస్య ఏర్పడుతోంది. యంగ్ హీరోలు ఆమెను తమ ప్రక్కన తీసుకోవాలంటే ఒకటికిపదిసార్లు ఆలచిస్తున్నారు. దానికి తోడు ఆమెకు ఈ మధ్య కాలంలో హిట్స్ ఏమీ లేవు. అందులోనూ తనకన్నా వయసులో తక్కువ అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించాల్సి వచ్చినప్పుడు త్రిషకు ఎక్కడ ఏజ్‌ ఎక్కువగా కనిపిస్తుందా అని ఆందోళన ఎక్కువైపోయిందని వార్తలు వచ్చాయి. 

ఇదిలా ఉంటే.. ‘ఈరోజుల్లో' వంటి హిట్‌ చిత్రంలో నటించిన రేష్మ దాదాపు త్రిష పోలికలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. నిర్మాతల దృష్టి అంతా ఎక్కువగా రేష్మమీదే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను తమ సినిమాల్లో నటించమని మంచి ఆఫర్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో త్రిషకు వచ్చే ఆఫర్లన్నీ ఈ జూనియర్‌ త్రిష ఎగరేసుకెళ్లడం దాదాపు ఖాయమే అంటున్నారు. ఈ సమస్య నుంచి త్రిష ఎలా బయిటపడుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అలాగే తనకి గ్లామర్ హీరోయిన్‌గా ఇంకా అయిదేళ్ల పాటు కొనసాగగలిగే సత్తా ఉందని చెప్పింది. ఇంకా నాలోని గ్లామర్ చెరిగిపోలేదు. వయసు గురించి నేనెప్పుడూ ఆలోచించను అంది. ఇప్పుడు వయసు ముప్ఫై దాటినా అందంగా కన్పిస్తే చాలు హీరోయిన్లకు అవకాశాలొచ్చేస్తున్నాయి..కాబట్టి నా కెరీర్ కి ఢోకా లేదు అంది. 

ఇక దమ్ము చిత్రంలో త్రిష, కార్తీక పాత్రలు గురించి బోయపాటి శ్రీనుని మీడియాకు చెపుతూ... ''కథ ప్రకారం ఇద్దరూ ఉండాల్సిందే. త్రిష, కార్తీక రెండు పాత్రలు కూడా పోటా పోటీగానే ఉంటాయి. సినిమా చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది'' అన్నారు. అలాగే ఎన్టీఆర్ కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.

బోయపాటి శ్రీను, త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్‌ వల్లభ నిర్మాత. ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్‌ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్‌ యాక్షన్‌ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. ఇక రీసెంట్ గా దమ్ము ఆడియో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.