విజయవాడ అర్ధరాత్రి అగ్నిప్రమాదం

విజయవాడ  అర్ధరాత్రి అగ్నిప్రమాదం

విజయవాడ పాతబస్తీ వన్‌టౌన్‌ మెయిన్‌ బజారులో అర్ధరాత్రి తర్వాత అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు గోడౌన్లు దగ్ధమయ్యాయి. విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల ఆస్థినష్టం సంభవించింది.

ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సాయికృష్ణా గ్లాస్‌ వేర్‌ స్టోర్స్‌లోని గోడౌన్‌లో మంటలంటుకున్నాయి. గుర్తించిన పొరుగు షాపు యజమాని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వచ్చే లోపే పక్కనే ఉన్న ఫ్యాన్సీ అండ్‌ జనరల్‌ మర్చంట్స్‌ గోడౌన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండో ఫైరింజన్‌ను పిలిపించారు. గంటన్నర తర్వాత మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.