15న 'గబ్బర్‌సింగ్' ఆడియో

15న 'గబ్బర్‌సింగ్' ఆడియో

 పవన్‌కళ్యాణ్ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంఓ పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్‌సింగ్' ఆడియో కార్యక్రమం ఈ నెల 15న హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ విషయాన్ని నిర్మాత గణేశ్ వెల్లడిస్తూ 'మా సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటికి తగ్గట్లుగా చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. పవన్‌కళ్యాణ్‌గారి కెరీర్‌లోనే నెంబర్‌వన్ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. ఇటువంటి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా హీరోగారికి కృతజ్ఞతలు. దర్శకుడు హరీశ్‌శంకర్ సినిమాని బాగా తీశారు. ఈ నెల 15న ఆడియోని, మేలో సినిమాని విడుదల చేస్తాం' అన్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.