బాబా మందిరంలో గవర్నర్ కంటతడి

 బాబా మందిరంలో గవర్నర్ కంటతడి

 పుట్టుపర్తి సత్యసాయి బాబాను తలుచుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కంట తడి పెట్టారు. సత్యసాయి ఆరాధానోత్సవాల్లో ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆయనకు మంత్రి రఘువీరారెడ్డి, కలెక్టర్ దుర్గాదాస్, ట్రస్టు కార్మదర్శి శ్రీనివాస్ స్వాగతం పలికారు.

గవర్నర్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయిని వెలిగే సూర్యుడని, ఆయన మనలోనే ఉన్నారని గవర్నర్ అన్నారు. బాబా చేసిన విద్యా, వైద్య సేవా కార్యక్రమాలను గవర్నర్ న రసింహన్ కొయాడారు. సత్యసాయి ఆరాధనోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. విదేశీ భక్తులు కూడా  పుట్టపర్తి కి చేరుకుంటున్నారు.

సత్యసాయి బాబా మృతి తీరని లోటు అని గవర్నర్ నరసింహన్ అన్నారు. సత్యసాయి బాబా శివైక్యం చెంది మంగళవారంనాటికి ఏడాది పూర్తి కావడంతో సత్యసాయి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఆరాధనోత్సవాల్లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సత్యసాయి ట్రస్టు చేపట్టే అన్ని సేవా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. 

మనతోనే ఉంటూ మనలోవెలుగులు నింపుతున్నారని గవర్నర్ అన్నారు. బాబాపై రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. గవర్నర్  నరసింహన్  శాంతిభవన్‌లో విడిది చేశారు. సత్యసాయి కుల్వంత్ హాల్‌లో ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆరాధనోత్సాల అనంతరం ఆయన మంత్రి రఘువీరా రెడ్డి స్వగ్రామం మడకశిరకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాదు వెళ్తారు.