నిఖిల్ రెమ్యునేషన్ అంతా..షాక్

నిఖిల్ రెమ్యునేషన్ అంతా..షాక్

హ్యాపీడేస్ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన యంగ్ హీరో నిఖిల్. రవితేజకు డూపులా తెరపై చెలరేగిపోయే నిఖిల్ రేటు చూసి ఇప్పుడు నిర్మాతలు కళ్లు తేలేస్తున్నారు. అతను ప్రస్తుతం అక్షరాలా అరకోటి డిమాండ్ చేస్తున్నారు. దాంతో అతనితో సినిమా చేద్దామని ముందుకు వస్తున్న దర్శకులు,నిర్మాతలు షాక్ అవుతున్నారు. యువత,వీడు తేడా వంటి యావరేజ్ హిట్టులు తప్ప అతని కెరీర్ లో చెప్పుకోతగ్గ హిట్ అనేది లేదు. ఈ నేపధ్యంలో అతను ఇంత డిమాండ్ చేయటం ఆశ్చర్యమే అంటున్నారు.

అయితే పరిశ్రమలో యంగ్ హీరోల కొరత ఉండటం,ఉన్న అతి కొద్ది మంది పెద్ద స్లాట్ లో ఉండటంతో వరుణ్ సందేశ్,నిఖిల్ వంటి హీరోలకు డిమాండ్ పెరిగింది. ప్రేమ కథలు చేద్దామనుకునే వారు వరుణ్ సందేశ్ దగ్గరకు వెళ్తున్నారు. కామిడీతో కూడిన యాక్షన్ చేద్దామని ఏ పవన్ కళ్యాణ్ కో,రవితేజకో కథ అనుకున్న వాళ్లు వాళ్లు అందక నిఖిల్ ప్రక్కన చేరుతున్నారు. దాన్ని నిఖిల్ క్యాష్ చేసుకుందామనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ నేపధ్యంలో నిఖిల్ కి అంత మార్కెట్ ఉందా అన్నది అందరి మధిలో రేగుతున్న ప్రశ్న. నిఖిల్‌ నటించిన సినిమా అంటే ఆంధ్రాలో ఏరియాలవారీ వ్యాపారం అస్సలు జరగదు. శాటిలైట్‌ బిజినెస్‌పై నమ్మకం లేదు. సినిమా విడుదలకు ముందు నిర్మాత రిస్క్‌ చేయాల్సిందే. ఇలాంటి మార్కెట్‌ లేని హీరో అర కోటి పారితోషికం డిమాండ్‌ చేయడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఇలాంటి హడావుడి చేసిన తరుణ్‌ సోదిలోకి లేకుండా పోయిన సంగతి యువ హీరోలు గుర్తుంచుకుంటే మంచిదని అంటున్నారు. 

దానికి తోడు నిఖిల్ కి వరస ప్లాప్ లకు కూడా ఎక్కువే. అయినప్పటికీ స్పీడుగా ఉండే కుర్రాడు అంటూ ఆఫర్స్ వస్తున్నాయి. యంగ్ డైరక్టర్స్ ..పెద్ద వాళ్ల డేట్స్ దొరకక నిఖిల్ తో అయినా నిరూపించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది అర్దం చేసుకోకుండా మేనేజర్‌ను ఏర్పాటుచేసుకుని డబ్బులు దండిగా లాగే ప్రయత్నం చేస్తున్నాడని పలువురు నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్‌ బ్రాండ్‌ విలువ చాలా తక్కువే. కనీసం పాతిక లక్షలు కూడా చేయడని వారు అంటున్నారు. అయితే దీనికి విరుద్ధంగా 50 లక్షల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నాడని వాపోతున్నారు.