తక్కువైనా ఫర్లేదుసినిమా ఏదైనా సరే...

అ లా మొదలైంది' అంటూ తెలుగునాట తన ప్రయాణానికి శ్రీకారం చుట్టింది నిత్యమీనన్. తొలి సినిమాతోనే గుర్తింపుని సంపాదించుకొంది. ఇటీవల విడుదలైన 'ఇష్క్'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. ప్రస్తుతం 'ఒక్కడినే' సినిమాలో నారా రోహిత్ సరసన నటిస్తోంది. 'దిల్సే' అనే అనువాద చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ''ఓ సినిమా ఒప్పుకోవాలంటే ముందు కథ నచ్చాలి. అందులో నా పాత్ర పరిధి తక్కువైనా ఫర్వాలేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు నాకు తెలీవు. కథానాయకుడి ఇమేజ్‌తో కూడా సంబంధం లేదు. వచ్చిన పేరు కాపాడుకొంటే చాలు'' అని చెబుతోంది. అన్నట్టు ఆదివారం నిత్య పుట్టిన రోజు