'ఢిల్లీ బెల్లీ' రీమేక్ లో హన్సిక

అమీర్ ఖాన్ హిందీలో నిర్మించిన చిత్రం 'ఢిల్లీ బెల్లీ' అక్కడ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రం తెలుగులో రీమేక్ అయ్యి ఇక్కడ ప్రేక్షకులను అలరించనుంది. యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రం హక్కులు పొందింది. ఆర్య, హన్సిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మానందం, సంతానం ముఖ్య భూమికలు పోషిస్తారు. కన్నన్ దర్శకత్వం వహిస్తారు. దక్షిణ భారత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు పలు మార్పుచేర్పులు చేసామని చెప్తున్నారు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా అంజలి నటించే అవకాశాలున్నాయి. వచ్చే నెల నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. తమన్ స్వరాలు సమకూరుస్తారు.
ఆధునిక పోకడలతో సాగిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర విజయవంతమైంది. తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మించేందుకు జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. గతంలో ఆర్య,సంతానం కాంబినేషన్ లో వచ్చిన బాస్ ఎనగర భాస్కరన్ సూపర్ హిట్ కావటంతో అదే కాంబినేషన్ లో చేస్తే మళ్లీ నవ్వులతో ధియోటర్ మారు మ్రోగుతుందని భావిస్తున్నారు.
ఇక హన్సిక విషయానికి వస్తే అంత బిజీ స్టార్ కానప్పటికీ హన్సికా మోత్వానీ అంటే యూత్‌లో ఒక ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్' రూపంలో తనకు మంచి హిట్స్ వచ్చాయంటోంది. ప్రస్తుతం తమిళంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజిగా ఉన్న ఒకప్పటి ఈ బాలతారకు అక్కడ విజయ్ సరసన నటించిన 'వేలాయుధం' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో ఒకప్పటి హీరోయిన్లు ఖుష్బూ, నగ్మాల తర్వాత హన్సికకి మాత్రమే ఇంతటి ఫాలోయింగ్ కనిపించిందని అక్కడ పత్రికలు అంటున్నాయి. అందుకే అక్కడ పెద్ద సంస్ధలు దృష్టి మొత్తం హన్సిక మీదే పెట్టాయి.
ఇక డిల్లీ భెల్లి విషయానికి వస్తే ఆ చిత్రం ఎంతవరకూ తెలుగు ప్రేక్షకులును ఆకట్టుకుంటుందనే డౌట్ కొందరు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం..అందులో అసభ్యత ఎక్కువ ఉండటమే. దానికి తోడు ఆర్య ఇక్కడ విలన్ గా ప్రేక్షకులకు అలవాటు పడ్డారు. దాంతోటే గతంలో వచ్చిన బాస్ ఎనగర భాస్కరన్ డబ్బింగ్ సినిమా నేనే అంబాని కూడా ఇక్కడ ఆడలేదు. అందులో నయనతార ఉన్నా కూడా ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు హన్సిక, బ్రహ్మానందంలతో ఏం రేంజిలో ఈ సినిమాని వర్కవుట్ చేస్తారో చూడాలి.