నా అల్లరికి హద్దే ఉండేది కాదు.

నా అల్లరికి హద్దే ఉండేది కాదు.

 తెరపై అందం, అమాయకత్వం కలబోసిన పాత్రల్లో కనిపించే కథానాయిక జెనీలియా. నిజ జీవితంలో మాత్రం అల్లరిపిల్లగా ఉండడానికే ఇష్టపడతానని చెబుతోంది. జెన్నీ మాట్లాడుతూ ''చిన్నప్పుడు నా అల్లరికి హద్దే ఉండేది కాదు. రోజూ అమ్మ చివాట్లు తినాల్సి వచ్చేది. వర్షం అంటే చాలా ఇష్టం. కిటికీలో కూర్చుని ఆస్వాదించడం ఓ పద్ధతి. వర్షంలో తడుస్తూ ఆటలాడడం మరో పద్ధతి. నేను రెండోదే ఎంచుకొనేదాన్ని. వర్షం వెలిశాక వెంటనే అమ్మ గుర్తొచ్చేది. అమ్మ చేతికి దొరక్కుండా పారిపోవడం మరో అనుభూతి. చదువు విషయానికొస్తే.. ఎవరూ వేలెత్తి చూపించే అవసరం ఉండేది కాదు. మార్కులన్నీ నావే. అందుకే ఎంత అల్లరి చేసినా ముద్దుగానే చూసేవారు'' అని తన బాల్యస్మృతుల్ని గుర్తు చేసుకొంది.