కాదన్నందుకు బాధే

కాదన్నందుకు బాధే

దక్షిణాది హీరోయిన్లంతా హిందీ అవకాశాల కోసం తిరుగుతుంటే కాజల్ అగర్వాల్ మాత్రం తన తలుపు తట్టిన అవకాశాలకు నో అంది. తెలుగు, తమిళంలో బిజీగా ఉండడం వల్లే హిందీ సినిమాలను తిరస్కరించానని, ఇలా చేసినందుకు ఎంతో బాధగా ఉందని చెప్పింది. ఈమె 2004లో ‘క్యూ.. హో గయా నా'లో నటిం చిన తరువాత తెలుగు చిత్రసీమలోకి ప్రవేశిం చింది. చందమామ, మగధీర, డార్లింగ్ హిట్ సినిమాలతో అగ్రతారగా పేరు సంపాదించుకుంది. ‘దక్షిణాది సినిమాలకు డేట్స్ ఇవ్వడం వల్ల హిందీ ప్రాజెక్టులను కోల్పోవాల్సి వచ్చింది. 

ఎంతో బాధగా ఉన్నా చేసేదేమీ లేదు. భవిష్యత్‌లో వచ్చే మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా..' అని కాజల్ వివరిం చింది. అక్షయ్ హీరోగా రూ పొందుతున్న స్పెషల్ చబ్బీస్ షూటింగ్‌తో ఇప్పుడు ఈ బ్యూటీ బిజీగా ఉంది. ఈ వెన్స్‌డే రూపొందిం చిన నీరజ్‌పాండే ఈ సిని మాకు దర్శకుడు. ‘వెన్స్ డే సినిమా అద్భుతంగా ఉంది. అందుకే ఆయన ప్రాజెక్టుకు నో అనలేకపోయాను. అంత మంచి దర్శకుడితో పనిచేయొద్దని ఎవరనుకుంటారు? పైగా అక్షయ్ ఇందులో హీరో..' అని ఈ 27 ఏళ్ల తార చెప్పింది.

సీబీఐ అధికారి నంటూ నమ్మించిన ఓ వ్యక్తి 19 87లో ముంబై నగల దుకాణాల్లో భారీ దోపిడీకి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆధారంగా స్పెషల్ చబ్బీస్ రూపొందుతోంది. ఢిల్లీ, ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో జిమ్మీ షేర్గిల్, మనో జ్ బాజ్‌పేయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరులో విడుదలయ్యే ఈ చిత్రంలో కనిపించే మహిళా నటి కాజల్ ఒక్కరే కావడం విశేషం. ‘హీరో ఆధిక్యం ఉండే సినిమా అయినా నా పాత్ర ఎంతో బాగుంది. మరో నలుగురు మగవాళ్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నప్పటికీ నాకేమీ ఇబ్బంది లేదు.' అని చెప్పుకొచ్చింది.