హికాక విడుదలకు మావోల తాజా డెడ్‌లైన్

హికాక విడుదలకు మావోల తాజా డెడ్‌లైన్

బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే జిన్నా హికాక విడుదలకు మావోయిస్టుల బుధవారంను డెడ్‌లైన్‌గా విధించారు. మావోయిస్టులు విధించిన డిమాండ్లలో కొంత సడలింపు ఇచ్చారు. 55 మంది భద్రతా సిబ్బంది హత్యలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న చెండా భూషణం అలియాస్ గాసీ విడుదలపై మావోయిస్టులు వెనక్కి తగ్గారు. అయితే కోరాపుట్ జిల్లాలోని బలిపేట గ్రామంలో ఖైదీలుగా ఉన్న 29 మందిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మావోయిస్టు నేత అరుణ స్థానిక రిపోర్టలకు డిమాండ్ లేఖను పంపారు. గాసీ విడుదల సాధ్యం కాదంటూ ఒడిశా ప్రభుత్వం శనివారం స్పష్టం చేయడంతో మావోయిస్టులు తాజా లేఖను వదిలివెళ్లారు.