'మే 8న జాతీయ సెలవుగా ప్రకటించాలి'

'మే 8న జాతీయ సెలవుగా ప్రకటించాలి'

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా మే 8న జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఈ మేరకు కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు. గతంలో కేంద్రాన్ని ఒప్పించి ఠాగూర్ 125వ జయంతిని జాతీయ సెలవుగా ప్రకటింపజేసిన సంగతిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఠాగూర్, స్వామి వివేకానంద, ప్రపుల్ల చంద్ర రే, ద్విజేంద్ర 150వ జయంతి ఉత్సవాలను రాష్ర్టవ్యాప్తంగా ఘనంగా జరుపుతామని ఆమె ప్రకటించారు.