త్వరలో రాజకీయ భవిష్యత్ ప్రకటన'

త్వరలో రాజకీయ భవిష్యత్ ప్రకటన'

 త్వరలోనే తన రాజకీయ భవిష్యత్‌ను ప్రకటిస్తానని ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు చెప్పారు. అయితే తాను ఏ పార్టీలో చేరబోతున్నది మాత్రం చెప్పలేదు. అన్నాహజారే ఆశయాలకు అనుగుణంగా అవినీతిపై తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతానన్నారు. చంద్రబాబు చాలా కాలం నుంచి తనకు సన్నిహితుడని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం నిన్న రాత్రి ఆయన తిరుమలకు వచ్చారు. ఈ తెల్లవారుజామున నైవేద్య విరామసమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.