'అలగ్జాండర్..ది గ్రేట్'గా NTR అదుర్స్

'అలగ్జాండర్..ది గ్రేట్'గా NTR అదుర్స్

ఎన్టీఆర్ 'దమ్ము'చిత్రంలో పురాతన కాలంలో జరిగే ఓ పీరియడ్ పాటను చిత్రీకరించనున్నారనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాట మరేదో కాదు రూలర్ అంటే సాగే పాట. ఆ పాటలో ఎన్టీఆర్ 'అలగ్జాండర్..ది గ్రేట్'గా కనిపించి అలరించనున్నాడని సమాచారం. గుర్రంపై ఎన్టీఆర్ వచ్చే ఆ గెటప్ అదిరిపోతుందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్,త్రిషలపై చిత్రీకరించే ఈ పాట సినిమా హైలెట్స్ లో ఒకటిగా బోయపాటి శ్రీను భావించి షూట్ చేసారు. త్రిష,ఎన్టీఆర్ ఇద్దరూ రాజుల కాలంలోలగా ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ వేసుకుని,పీరియడ్ కాలానికి చెందిన సెట్ లో డాన్స్ చేసారు. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఈ పాటను ప్రత్యేకమైన శ్రద్దతో తీర్చిదిద్దినట్లు చెప్తున్నారు.

ఎన్టీఆర్‌ని మాస్ హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసేవారికి ఆయన మాస్‌తో పాటు ఫ్యామిలీ హీరోగా కనిపిస్తారు. ప్రతి కుటుంబంలో ఇలాంటి కొడుకు, ఇలాంటి హీరో ఉండాలని అందరూ కోరుకునేలా ఉంటుంది ఆయన పాత్ర అంటున్నారు దమ్ము నిర్మాత కె.ఎస్ రామారావు. బోయపాటి శ్రీను దర్సకత్వంలో ఎన్టీఆర్,త్రిష,కార్తీక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'దమ్ము'. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాలో ప్రతీ అంశమూ కూడా మాస్ ని ఆకట్టుకుని విజిల్స్ వేయించే రీతిలో బోయపాటి తీర్చిదిద్దుతున్నాడని టాక్. 

ఇక ఇప్పటికే విడుదలైన దమ్ము పాటలు అంతటా మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. దానికి తోడు మాస్ లుక్ తో వదిలిన దమ్ము ప్రోమో కూడా అబిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. సింహాద్రి వంటి మరో సూపర్ హిట్ ఎన్టీఆర్ నుంచి వస్తుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ సైతం ఊసరవెల్లి చిత్రం ఫలితం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఊసరవెల్లి తో సమానంగా మొదలైన ఈ చిత్రం ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.

తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.భానుప్రియ, నాజర్‌, సుమన్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్‌, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. రచన: ఎమ్‌.రత్నం, పాటలు: చంద్రబోస్‌, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత. కె.ఎస్‌.రామారావు సమర్పకులు.