నా ప్రేమ విఫలమైంది:నయనతార

నా ప్రేమ విఫలమైంది:నయనతార

ఈ మధ్యకాలంలో దక్షిణాది సినీ నిజ జీవిత ప్రేమ కథల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది..నయనతార,ప్రభుదేవాల లవ్ స్టోరీ. అయితే అది అర్దాంతరంగా ముగిసి తిరిగి ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఇప్పటివరకూ ఆమె ఎక్కడా ఈ విషయమై నోరు విప్పి చెప్పలేదు. అయితే రెండు రోజుల క్రితం తమిళ టీవీ ఛానెల్స్ లో ఆమె తన ప్రేమ విఫలమైందంటూ చెప్పుకొచ్చారు. ఆ కథనాల్లో చెప్పిన దాని ప్రకారం... నేను నమ్మిన ప్రేమకోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రభుదేవా కోసం చాలా వదులుకున్నా. అయితే పెళ్లి వరకు వెళ్లిన మా ప్రేమ విఫలమైంది. ప్రేమలో సమస్య తలెత్తితే ఒక హద్దులోపే అణిగిపోవాలి. లేకుంటే విశ్వరూపం దాల్చి విఫలానికి దారితీస్తుంది. నా జీవితంలో జరిగింది కూడా అదే. ఇది నా వ్యక్తిగత విషయం. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుదేవాతో ఉన్నప్పుడు వంద శాతం నిజాయతీతో నడుచుకున్నా. ఆ ప్రేమకు అర్థం, విలువ లేదని తెలియడంతో.. దూరమవడమే నయమనుకున్నా. ఇలా నా ప్రేమ అర్ధాంతరంగా ఆగిపోతుందని అనుకోలేదు. అయితే జీవితంలో ఏదైనా, ఎప్పుడైనా జరుగుతుందనే విషయాన్ని గ్రహించాను అని చెప్పింది. ప్రస్తుతం ఆమె రానా,క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'కృష్ణం వందే జగద్గురుం'లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది