నింగికేగిన పిఎస్‌ఎల్‌వి సి19 రాకెట్

నింగికేగిన పిఎస్‌ఎల్‌వి సి19 రాకెట్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం శాస్త్రవేత్తలు పిఎస్ఎల్‌వి సి19 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకు వెళ్లింది. రిశాట్-1ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. పదిహేడు నిమిషాల యాభై సెకండ్లలో రాకెట్ రిశాట్-1ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది.

ఇస్రో శాస్త్రవేత్తలు దాదాపు పదేళ్లు కష్టపడి దీనిని రూపొందించారు. మైక్రోవేట్ సెన్సింగ్ పరిజ్ఞానంతో రీశాట్-1 ఉపగ్రహం పని చేస్తోంది. ఇది వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. పగలు, రాత్రి ఇది పని చేస్తోంది. దీని ద్వారా పూర్తిగా మేఘావృతమైన సమయంలోనూ ఛాయాచిత్రాలు తీయవచ్చు.

వ్యవసాయరంగంతో పాటు వాతావరణ అధ్యయనానికి ఉపయోగపడుతోంది. ప్రయోగం విజయవంతమవడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందించారు. కాగా పిఎస్ఎల్‌వి సి19 ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సహాల్లో మునిగితేలారు.

ఇది షార‌్‌లోని అందరి విజయమని ఈ ప్రయోగంతో మా కల నిజమైందని ప్రొఫెసర్ యు.ఆర్.రావు అన్నారు. మైక్రోవేవ్ సెన్సింగ్ పరిజ్ఞానం చాలా క్లిష్టతమైందని, దేశ అంతరిక్ష ప్రయోగ చరిత్రలో ఇది ఓ మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమష్టి కృషితోనే రీశాట్-1 ప్రయోగం విజయవంతమైందని మరో శాస్త్రవేత్త వీరరాఘవన్ తెలిపారు.