రికార్డులను బ్రేక్ చేసిన 'రచ్చ'!!

 రికార్డులను బ్రేక్ చేసిన 'రచ్చ'!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించి తాజాగా విడుదలైన చిత్రం "రచ్చ". ఈ చిత్రం ఓపెనింగ్ రోజైన ఈనెల ఐదో తేదీన ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఫలితంగా... ఓపెనింగ్ రోజున ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న 'బిజినెస్‌మేన్', 'ఊసరవెల్లి' రికార్డులు బద్ధలైనట్టు "రచ్చ" చిత్ర నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. 

ఈ కలెక్షన్లపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "రచ్చ" ఓపెనింగ్ డే కలెక్షన్లు రూ.8.54 కోట్లుగా ఉన్నాయన్నారు. ఇవి కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వచ్చిన వసూళ్ళని చెప్పారు. పక్క రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుంటే "రచ్చ" సరికొత్త ఆల్ టైమ్ రికార్డులను సృష్టించనుందని చెప్పారు. 

కాగా, ఈ చిత్రంపై మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ.. ప్రేక్షకులు ఇవేమీ పట్టించుకోకుండా సినిమా థియేటర్లకు భారీ మొత్తంలో తరలి వస్తున్నారు. దీంతో మున్ముందు మరిన్ని రికార్డులను బద్ధలు కొట్టగలదన్న నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేశారు.