మోహన్ బాబుతో హాట్ శ్రియ

మోహన్ బాబుతో హాట్ శ్రియ

హీరోయిన్ శ్రియ గత కొంత కాలంగా వరుస ప్లాపులతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. అమ్ముడు ఇటీవల నటించిన ‘నువ్వా నేనా' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఒకప్పుడు రజనీకాంత్, చిరంజీవి, విక్రమ్‌ లాంటి పెద్ద హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు బొత్తిగా రావడమే లేదు. దీంతో హీరో ఇమేజ్‌, ఎలాంటి సినిమా అనే విషయాలను పక్కనపెట్టి అవకాశాలు రావడమే మహా భాగ్యంగా ఎదురు చూస్తోంది. 

తాజాగా శ్రియ మోహన్ బాబు నటిస్తున్న మైథలాజికల్ చిత్రంలో నెగెటివ్ రోల్ చేసే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంలో ఆమె ‘అప్సర' పాత్రలో కనిపించబోతోంది. మోహన్ బాబు రావణాసురుడిగా కనిపించబోతున్న ఈచిత్రం వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఈ చిత్రంలో ఒకప్పటి అందాల తార శ్రీదేవిని మండోధరిగా నటింపజేయాలనుకున్నాడు  మోహన్ బాబు  తనయుడు, నిర్మాత మంచు విష్ణు. ఈ విషయమై ఇటీవల ఆమెను సంప్రదించగా.....రూ. కోటిన్నర పారితోషికం ఇస్తేనే చేస్తానని షాక్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్లకు సరైన పాత్రల లభించడం లేదని శ్రియ ఇటీవల మీడియా ముందు వాపోయింది. ‘కథానాయికల కోసం కథలు తీసుకురావాలి. అది దర్శకుల బాధ్యత. హీరోయిన్లకోసం పాత్రలు సృష్టించాల్సిన అవసరం ఉంది. అంతేకాని ఎలాంటి కథలు తేకుండా హీరోయిన్ల నుండి అద్భుతమయిన పాత్రలు ఆశించి ఏం లాభం. దర్శకులు చెప్పినట్లు చేసుకుంటూ పోతాం'' అంటోంది ఢిల్లీ భామ  శ్రియ . ఏ సినిమాలోనైనా నాలుగు పాటలు, అందాల ఆరబోతలు, కథానాయికలను సినిమాలో చూపించే విధానం ఇదే. ఎప్పుడూ ఇలా చూపిస్తారంటే మేమేం చేస్తాం. మాకూ మంచి పాత్రల్లో నటించాలని ఉంటుంది. కానీ ఏం లాభం అని వాపోయింది.