నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

 నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

 శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు అడుగంటింది. దాంతో జలవిద్యుత్‌ కేంద్రంలో రాత్రి నుంచి విద్యుత్‌ ఉత్పాదన నిలిచిపోయింది. 800 అడుగుల నీటిమట్టం వరకు విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం వున్నప్పటికీ హ్యామరేజెస్‌ ఏర్పడతాయనే ఉద్దేశ్యంతో అధికారులు ఉత్పాదన నిలిపివేశారు.

కేవలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 804.50 అడుగుల నీటిమట్టం వుంది. నీటిమట్టం 800 అడుగులకు చేరగానే రెండు పవర్‌ హౌస్‌లలోనూ విద్యుత్‌ ఉత్పత్తి నిలిపి వేయనునన్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.